
ధూమపానం, మద్యపానం, తరచుగా టీ-కాఫీ అలవాట్లు క్రమంగా మీ దంతాలను పసుపు రంగులోకి మార్చేస్తాయి. ఈ మొండి పసుపు రంగును శుభ్రం చేయడానికి మీరు రెండు సహజ ఉత్పత్తులను మిక్స్ చేసి దంతాల మీద అప్లై చేయడం వల్ల పసుపు దంతాలు త్వరగా తొలగిపోతాయి.

చిటికెడు అశ్వగంధ పొడిని ఒక చెంచా పెరుగులో కలిపి దంతాల మీద రాసుకుంటే పసుపు దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి.. ఈ అశ్వగంధ పొడిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పంటి నొప్పిని తగ్గిస్తుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మీ దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది.

ఆవాల నూనె చిటికెడు ఉప్పు కలిపి తీసుకుని చిగుళ్లపై మసాజ్ చేయడం వల్ల పసుపు రంగు పోతుంది. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. తెల్లటి దంతాల కోసం ప్రతిరోజూ కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు. ఇలా చేయటం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది.

దంతాల మెరుపు కోసం బేకింగ్ సోడా, పటిక పొడి కూడా గొప్పగా పనిచేస్తుంది. ఇందుకోసం బేకింగ్ సోడాను పటిక పొడిని సమాన నిష్పత్తిలో కలపి బ్రష్ చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేయండి. మీరు బేకింగ్ సోడాతో టూత్‌పేస్ట్‌ను కూడా ఉపయోగించవచ్చు.

వేప పుల్లతో కూడా పసుపు దంతాలకు స్వస్తి చెప్పొచ్చు. వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు పసుపు రంగును తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీ దంతాలను తెల్లగా చేయడంతోపాటు చిగుళ్లను బలోపేతం చేస్తుంది.