AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉంది..? ఇంట్లోనే ఇలా తెలుసుకోండి..

గుండె ఆరోగ్యం అనగానే చాలామంది ఆయాసం లాంటి వ్యాధి లక్షణాల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ మన శరీరం మన గుండె ఎంత బలంగా, ఫిట్‌గా ఉందో తెలిపే సానుకూల సంకేతాలను కూడా ఇస్తుందని మీకు తెలుసా? నిమిషానికి కొట్టుకునే నాడి వేగం నుంచి నడిచేటప్పుడు వచ్చే మార్పుల వరకు.. మీ గుండె నిజంగా పదిలంగా ఉందో లేదో తెలిపే ఆ ముఖ్యమైన సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Sep 04, 2026 | 11:49 AM

Share
గుండె ఆరోగ్యానికి సంబంధించి విశ్రాంతి సమయంలో హార్ట్ బీట్ కీలకం. ఢిల్లీ మెదాంత మూల్‌చంద్ ఆసుపత్రి కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ తరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రిలాక్స్‌గా ఉన్నప్పుడు గుండె నిమిషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకోవడాన్ని సాధారణంగా పరిగణిస్తారు. శరీర దృఢత్వం, శారీరక వ్యాయామం అలవాటున్న వ్యక్తులలో ఇది 60 కంటే తక్కువగా నమోదైనా అది ఉత్తమ ఆరోగ్యానికి నిదర్శనంగా భావించవచ్చు.

1 / 5
గుండె సమర్థవంతంగా పనిచేస్తుందనడానికి బీపీ స్థిరంగా ఉండటం ప్రధానం. సాధారణంగా 120/80 mmHg బీపీని ఆరోగ్యకరమైన గుండెకు ప్రామాణికంగా గుర్తిస్తారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవడం అత్యవసరం. దీనితో పాటు వేగంగా నడిచినప్పుడు లేదా మెట్లు ఎక్కినప్పుడు అసాధారణమైన ఆయాసం రాకుండా తేలిగ్గా ఉండగలగడం కూడా బలమైన గుండె సామర్థ్యానికి మంచి నిదర్శనమని వైద్యులు చెబుతున్నారు.

2 / 5
శారీరక శ్రమ చేసినప్పుడు గుండె ఎలా స్పందిస్తుందో గమనించడం ద్వారా దాని ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. వర్కౌట్లు లేదా పరుగు తీసినప్పుడు హార్ట బీట్ రేటు పెరగడం సహజం. అయితే వ్యాయామం ముగిసిన కొద్దిసేపటికే పల్స్ రేట్ తిరిగి సాధారణ స్థితికి చేరితే, మీ కార్డియోవాస్కులర్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. శరీరం వేగంగా రికవరీ అవ్వడం దృఢమైన హృదయ స్పందనకు సంకేతం.

3 / 5
రోజువారీ పనులు లేదా శారీరక శ్రమ చేసేటప్పుడు ఛాతీలో ఎలాంటి ఒత్తిడి, బిగువు లేదా అసౌకర్యం కలగకపోవడం ఆరోగ్యకరమైన గుండెకు నిదర్శనం. అయితే ఏ చిన్నపాటి ఛాతీ నొప్పి వచ్చినా దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే ఎలాంటి కారణం లేకుండా కాళ్లు, చీలమండలు లేదా అరికాళ్లలో వాపులు రాకపోవడం కూడా రక్తం సాఫీగా పంప్ అవుతుందనడానికి ఒక మంచి సూచిక. రక్త ప్రసరణలో లోపాలు తలెత్తినప్పుడే శరీర దిగువ భాగాల్లో నీరు చేరి వాపులు వస్తుంటాయి.

4 / 5
ఈ లక్షణాలు గుండె దృఢత్వాన్ని సూచించినప్పటికీ, కేవలం వీటి ఆధారంగానే పూర్తి ఆరోగ్యాన్ని నిర్ధారించుకోలేమని గుర్తుంచుకోవాలి. సమతుల్య పోషకాహారం, నిత్య వ్యాయామం, సరైన బరువు, రక్తంలో చక్కెర, బీపీని అదుపులో ఉంచుకోవడం వంటి అలవాట్లు గుండెను కాపాడతాయి. శరీరంలో ఏవైనా అసాధారణ మార్పులు లేదా లక్షణాలు కనిపిస్తే సొంత నిర్ణయాలు తీసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యం.

5 / 5
Follow Us