
- బంగాళాదుంపలు చంకల కింద దుర్వాసనను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇందుకోసం బంగాళాదుంపను తొక్క తీసి తురుముకోవాలి. దాని నుండి రసాన్ని పిండి వేయాలి. దానిలో ఒక దూదిని ముంచి చంకలకు అప్లై చేసి, అరగంట పాటు అలాగే ఉంచి, తర్వాత కడిగేయాలి. ఇది దుర్వాసనను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

- కలబంద జెల్ తీసుకుని మీ చంకలపై అప్లై చేసి 20 నుండి 25 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయండి. రోజుకు రెండుసార్లు వాడటం వల్ల దుర్వాసన పోతుంది. ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు యాంటీబ్యాక్టీరియల్ సబ్బు లేదా బాడీ వాష్‌తో చంకలను బాగా శుభ్రం చేసుకోండి.

- మీ చంకలను శుభ్రం చేయడానికి, దుర్వాసనను తొలగించడానికి మీరు కొబ్బరి నూనెను మీ చంకలకు రాసుకోవాలి. 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై కడిగేయవచ్చు. ఇది చంకల కింద బ్యాక్టీరియాను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

- బేకింగ్ సోడాను మీ చంకలకు అప్లై చేయడం వల్ల కూడా దుర్వాసన పోతుంది. 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంతో కలిపి, మీ చంకలకు సున్నితంగా అప్లై చేసి, 10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై కడిగేయండి.

- టమోటా రసం తీసుకుని అందులో 2 నుండి 3 చుక్కల నిమ్మరసం కలిపి దూది సహాయంతో చంకలకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి.