డార్క్ సర్కిల్స్ సమస్య రూపాన్ని లేదా అందాన్ని నాశనం చేస్తుంది. నల్లటి వలయాలను వదిలించుకోవడం అంత సులభం కాదు. డార్క్ సర్కిల్‌లకు కారణమేమిటో, వాటిని ఏ విధంగా తగ్గించవచ్చో, తొలగించవచ్చో తెలుసుకుందాం..
నిద్ర లేకపోవడమే కారణం: మీరు తక్కువగా నిద్రపోతున్నట్లయితే.. నల్లటి వలయాలు తప్పక వస్తాయి. ఇదే విషయాన్ని అనేక నివేదికలలో వెల్లడించడం జరిగింది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి.
ఫోన్ అలవాటు: ఫోన్ లేని సాధారణ జీవితాన్ని ఊహించుకోవడం అంత సులభం కాదు. ఫోన్ వాడటం ఇప్పుడు ఒక రకమైన వ్యసనమే. కానీ పగలు, రాత్రి అనే తేడా లేకుండా స్క్రీనింగ్‌లో సమయం గడపడం వల్ల చర్మం డల్‌గా కనిపిస్తుంది.
సరికాని ఆహారం: తప్పుడు జీవనశైలి, జంక్ ఫుడ్స్ కారణంగా ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా.. చర్మానికి కూడా హానీ కలుగుతుంది. జంక్ ఫుడ్స్, ఇతర అంశాలు చర్మాన్ని డల్, డార్క్‌గా కనపడేలా చేస్తాయి.
నల్లటి వలయాలకు ఇంటి నివారణలు: కంటి కింద చర్మం నలుపును తొలగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి దోసకాయ, బంగాళాదుంప రసం. ఈ రెండింటిలో ఉండే ఎలిమెంట్స్ చర్మాన్ని రిపేర్ చేసి మెరిసేలా చేస్తాయి.
అలోవెరా : నల్లటి వలయాలను తొలగించడంలో కలబంద అద్భుతంగా ఉపయోగపడుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటిసెప్టిక్ లక్షణాలతో నిండిన కలబంద చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.