
ఉడికించిన గుడ్లు అందరికీ ఇష్టమైనవి- వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే, కొన్నిసార్లు వాటి తొక్క తీయడం మనకు పెద్ద సవాలుగా మారుతుంది. కొన్నిసార్లు, పెంకు సులభంగా వచ్చినా.. మరికొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది. ఈ సదర్భంగా దాన్ని పెంకును తొలగించేందుకు చాలా సమయం పడుతుంది.

అయితే ఇలా తీసే క్రమంలో కొన్ని కొన్ని సార్లు గుడ్డు పెంకలు సరిగ్గా రాకా.. మీ గుడ్డు అంతటా విరిగిపోతుంది, అంతే కాకుండా ఈ పెంకులు మన చేతులకు గుర్చుకొని.. కిందపడి అందులోని పచ్చసోన నాశనం అవడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు మనకు కొద్దిగా కోపం కూడా వస్తుంది.

ఈ సమస్యను అదిగమించేందుకు, ఉడికించిన గడ్డు విరిగి పోకుండా, దానిలోని పచ్చసోన చెదరకుండా గుడ్డు పెంకును తీసుసేందుకు ఒక సులభమైన మార్గం ఉంది. దీని ద్వారా మీరు కేవలం కొన్ని సెకన్లలోనే గుడ్డు తొక్కను తొలగించవచ్చు.

మొదటగా గుడ్డును ఒక గ్లాసులో వేయండి. ఆ గాజు పరిమాణం గుడ్డు సరిగ్గా సరిపోయేంత పెద్దదిగా గాజు ఉండాలి. తర్వాత ఆ గ్లాస్‌ను నీటితో నింపండి. అయితే నీటిని గ్లాస్ ఫుల్‌గా నిపొంద్దు. నీటికి, గాజు పైభాగానికి మధ్య ఒక సెంటీమీటర్ గ్యాప్ ఉండేలా చూసుకోండి.

తర్వాత మీ అరచేతితో గాజును కప్పి, షెల్ మీద కొన్ని పగుళ్లు వచ్చే వరకు దాదాపు 3 సెకన్ల పాటు అటూ ఇటూ కదిలించండి. ఇ తర్వాత నీటిని తొలగించిం తొక్క తీయడానికి ప్రయత్నించండి. అప్పుడు గుడ్డు పగలకుండా మొత్తం ఒకే సారి బయటకు వస్తుంది.