
కావాల్సిన పదార్ధాలు : కుండ ఒకటి, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా చికెన్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి డానికి అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, మసాలా పొడులు వేసి 2 గంటల పాటు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి.

కుండ కొత్తది అయితే రుచికరంగా ఉంటుంది. అయితే, దానిలో ముందుగా నూనె వేసి శుభ్రం చేసి వాడాలి.

చికెన్: ఆదివారం వస్తే చాలు చికెన్ లేనిదే ముద్ద దిగదు. వీటిని తినడం కొంతవరకు మంచిది కానీ, నష్టాలు కూడా ఉన్నాయి. మసాలా ఫుడ్స్ ఎక్కువగా తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు.

మట్టి కుండలో ఏ కూర అయినా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మట్టి వాసన వస్తుంది అలాగే మంచి రుచిని కూడా ఇస్తుంది. ఈ కుండ చికెన్‌ను సాధారణంగా అన్నంతో కానీ రోటీలతో కానీ రుచిగా ఉంటుంది.