
ఇక మృగశిర కార్తె వస్తే చేపల మార్కెట్లు కిక్కిరిసిపోతాయి. అంతే కాకుండా పత్రి ఇంట్లో నుంచి చేపల వాసనల గుమ గుమలు వాడ వాడల్లో సందడి చేస్తుంటాయి. అయితే మనం ఇప్పుడు మృగశిర కార్తె రోజు వండుకొని చేపల పులుసు ఎలా చేయాలి. అంతే కాకుండా ఒక్కసారి తింటే ఆ రుచి మర్చి పోకుండా ఉండాలంటే? చేపల కర్రీ ఎలా వండితే టేస్ట్ అదిరిపోతుందో ఇప్పుడు చూద్దాం.

చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు : కేజీ చేపలు, ఉప్పు, రుచికి సరిపడ, కారం, 3 టీస్పూన్స్, పసుపు చిటికెడు, ఉల్లిపాయలు, అల్లం పేస్ట్ , చింత పండి నిమ్మకాయ సైజు, నూనె, కరివేపాకు, మెంతిపొడి,ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, కాచిన ఉల్లిపాయ పేస్ట్, జీలకర్ర, దాల్చిన చెక్క, ఆవాలు టీస్పూన్, వెల్లల్లి రెబ్బలు నాలుగు.

ముందుగా స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టేయాలి. తర్వాత నూనె పోసి, జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, వంటివి పోపు వేసుకోవాలి, తర్వాత చింత పండు రసం, వేయాలి. ఇక 15 నిమిషాల పాటు చింత పండు రసం మరిగేలా చూసుకోవాలి.

తర్వాత కారం, ఉప్పు వేసుకొని మరికొద్ది సేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత చేప ముక్కలపై కాస్త కారం, ఉప్పు, మసాల చల్లుకొని,10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వాటిని ఆ మరుగుతున్న చింత పండు రసంలో వేసుకోవాలి. తర్వాత మెంతిపొడి, ధనియాల పొడి వేసుకోవాలి.

ఆ తర్వాత మరో 10 నిమిషాల పాటు చేపలు ఉడికి, రసం చిక్కగా వచ్చే వరకు మరగ బెట్టాలి. తర్వాత మసాల, కొత్తి మీర తరుగు వేయాలి. అంతే వేడి వేడి చేపల పులుసు రెడీ. మరీ మీరు కూడా ఓ సారి ట్రై చేసి, రుచి ఎలా ఉందో చెప్పండి.