రోజువారీ చర్మానికి కొరియన్ విటమిన్ E ఫేస్ సీరమ్‌ని జోడించడం వల్ల ఊహించలేని ప్రయోజనాలు పొందవచ్చు. ఈ సీరమ్ మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సులువుగా కొరియన్ విటమిన్ E ఫేస్ సీరమ్‌ని తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే.. కొరియన్ విటమిన్ ఇ ఫేస్ సీరమ్ తయారు చేయడానికి.. 3-4 విటమిన్ ఇ ఆయిల్ క్యాప్సూల్స్, 1 టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ రోజ్‌షిప్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆర్గాన్ ఆయిల్, 5-6 చుక్కల సుగంధ ఎసెన్షియల్ ఆయిల్, 5-6 చుక్కల లావెండర్ నూనె, ఒక గాజు సీసా ఉంటే సరిపోతుంది.