గ్యాస్ట్రిక్, అల్సర్ వంటి సమస్యలు కూడా చాలా వరకు ఆహారంపై ఆధారపడి ఉంటాయి. స్పైసీ, పాత ఆహారాలకు బదులుగా ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను తినాలి. అలాగే నీరు పుష్కలంగా త్రాగాలి. అప్పుడు జీర్ణక్రియ సక్రమంగా జరిగి ఉదర సమస్యలు తగ్గుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కడుపు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా చేయాలి. ఫలితంగా జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. ఇన్ని నియమాలు పాటించిన తర్వాత కూడా డైజెస్టివ్ డిజార్డర్ ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.