
చాలా మంది ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కప్పు కాఫీ తాగుతారు. లేదంటే మరేదైనా కారణంతో రోజులో మరిన్ని సార్లు కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. నిజానికి ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం ఇవన్నీ కూడా ముఖ చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. అలా ఒత్తిడి ఎదుర్కోన్న రోజుల్లో.. ఉదయం లేచి అద్దం ముందు నిలబడితే కొన్నిసార్లు మీరే ఆశ్చర్యపోతారు. ముఖం చర్మంపై రాత్రికి రాత్రే మొటిమలు కనిపించాయి. ఇలాంటి అనుభవాన్ని చాలా మంది ఎదుర్కొని ఉంటారు. మరైతే ఎలా వీటి నుంచి ఎలా ఉపశమనం పొందాలి అని ఆలోచిస్తున్నారా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

ముఖంపై మొటిమలు వస్తే వాటి నుంచి ఉపశమనం పొందడానికి కనీసం వారం రోజులు పడుతుందని అందరూ అనుకుంటుంటారు. కానీ రాత్రికిరాత్రే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకు ఇంట్లోనే ఈ టిప్స్ ఫాలో అయితే సరి. ఫలితంగా, మొటిమలు ఒక్క రాత్రిలోనే మాయమవుతాయి. కొద్దిగా పండిన బొప్పాయిని రాత్రి పడుకునే ముందు మొటిమలపై రాస్తే ఉదయానికి మొటిమలు మాయమవుతాయి.

చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి, డల్ స్కిన్‌ను ప్రకాశవంతంగా మార్చడానికి రసాయన ఉత్పత్తులకు బదులుగా సాధారణ ముల్తానీ మట్టిని ఉపయోగించవచ్చు. ఇంట్లో చందనం ఉంటే మరీ మంచిది. రాత్రి పడుకునే ముందు మొటిమల ప్రభావిత ప్రాంతాల్లో గంధాన్ని పూసుకుని నిద్రపోవాలి. ఉదయాన్నే నిద్రలేచాక కడిగేయాలి. ఇలా చేస్తే ఒక్క రాత్రిలోనే మొటిమలన్నీ మాయమైపోవడాన్ని మీరు చూస్తారు.

అయితే మొటిమను ఎప్పుడూ చేతులతో గిల్లకూడదు. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి కానీ వాటి తాలూకు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు కొన్ని వారాల పాటు అలాగే ఉంటాయి. అప్పుడు ఆ మచ్చలను తొలగించడానికి మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి వస్తుంది.

టొమాటోలు మచ్చలను తొలగించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. టొమాటో రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమల మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది. టొమాటోను కట్ చేసి, ముఖానికి నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.