
ముఖంపై వచ్చే బ్లాక్ హెడ్స్ ఏడాది పొడవునా వదలవు. దీనితో పాటు వైట్ హెడ్స్ సమస్య కూడా తలెత్తుతుంది. ఈ వైట్ హెడ్స్ మొటిమల్లా కనిపిస్తాయి. ఈ వైట్ హెడ్స్ ముక్కుపై, చంపలపై ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. ఈ బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ సమస్య నుంచి బయటపడాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ సమస్య జిడ్డు చర్మానికి మాత్రమే కాదు. పొడి చర్మతత్వం కలిగిన వారికి కూడా ఈ సమస్య ఉంటుంది. ప్రధానంగా చర్మంపై మురికి చేరడం వల్ల ఈ రకమైన సమస్య వస్తుంది. కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

పొడి చర్మంపై బ్లాక్ హెడ్స్ తొలగించడానికి దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్‌ను తయారు చేసి ముఖంపై 2 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత నీటితో శుబ్రం చేసుకుంటే సరి. ఈ ప్యాక్ వారానికి రెండు సార్లు వాడితే బ్లాక్ హెడ్స్ ఇట్టే తొలగిపోతాయి.

వైట్ హెడ్స్ తొలగించడానికి కార్న్‌ఫ్లోర్, వెనిగర్ ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్ చేయడానికి కార్న్‌ఫ్లోర్‌ను వెనిగర్‌తో పేస్ట్‌లా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి స్క్రబ్ లా ఉపయోగించాలి. వారానికి 3 సార్లు స్నానం చేసే ముందు దీనిని ఉపయోగిస్తే బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ సమస్య పోతుంది.

అంతే కాకుండా ఆవిరి పట్టడం వల్ల కూడా ఈ సమస్య తొలగిపోతుంది. ముందుగా చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మురికి చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. నీళ్లను వేడి చేసి, ఆ వస్త్రాన్ని తలపై కప్పుకుని ముఖానికి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం ద్వారా మూసుకుపోయిన చర్మ రంద్రాలు తెరచుకుని సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.