
డాక్టర్ విక్రాంత్ సింగ్ గారి ప్రకారం, మనకు వచ్చే మెజారిటీ రోగాలకు ప్రధాన కారణం రక్తంలో సడన్‌గా పెరిగే గ్లూకోజ్ స్థాయిలే (Glucose Spikes). మనం రోజూ తినే తెల్లటి అన్నం వల్ల షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. దీనిని అడ్డుకోవడానికి అన్నంలో కొద్దిగా స్వచ్ఛమైన ‘నెయ్యి’ కలిపి తినాలని ఆయన సూచిస్తున్నారు.

నెయ్యిని ఆహారంలో చేర్చడం వల్ల అన్నం జీర్ణమయ్యే వేగం తగ్గి, గ్లూకోజ్ రక్తంలోకి ఒకేసారి కాకుండా నిదానంగా విడుదలవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య తగ్గుతుంది. నెయ్యి అనగానే చాలామంది కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడతారు. కానీ, పరిమితంగా నెయ్యి తినడం వల్ల ఎటువంటి హాని జరగదని, పైగా అది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని డాక్టర్ గారు స్పష్టం చేశారు.

ఆరోగ్యంగా ఉండటానికి ఉదయం లేచిన వెంటనే చక్కెర వేసిన టీ తాగడం పూర్తిగా మానేయాలని ఆయన చెబుతున్నారు. ఒకవేళ టీ తాగాలనుకుంటే పాలు, చక్కెర లేకుండా కేవలం డికాక్షన్ లాగా తాగడం మంచిది. మన ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండి, ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. అందుకే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోసలకు బదులుగా గుడ్లు, మొలకెత్తిన గింజలు (Sprouts), డ్రై ఫ్రూట్స్ లేదా వెజిటబుల్ సలాడ్స్ వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాన్ని తీసుకోవాలి.

రోజుకు మూడు నాలుగు సార్లు తినడం కంటే కేవలం రెండు పూటల ఆహారం (టూ మీల్స్) తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం. మార్కెట్లో దొరికే రిఫైన్డ్ ఆయిల్స్ వాడకం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగి గుండెపోటు, పక్షవాతం, కీళ్ల నొప్పులు వస్తున్నాయని, వాటి స్థానంలో గానుగ నూనెలను మాత్రమే వాడాలని ఆయన గట్టిగా హెచ్చరిస్తున్నారు. ప్యాకెట్ పాలు, ప్లాస్టిక్ ప్లేట్ల వాడకం, జంక్ ఫుడ్స్ వంటి ఆధునిక అలవాట్లు మన ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయి.

మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి సహజమైన వంటలను, జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే ఏ డాక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. డాక్టర్ విక్రాంత్ గారి ఆత్మీయమైన మాటలు, బాధ్యతాయుతమైన సలహాలు విన్న రోగులు ఆయనను దేవుడిగా భావిస్తూ, తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి ఆయన హాస్పిటల్‌కు తరలివస్తున్నారు.