
బేకింగ్ సోడా, నీరు: మీ వాటర్ బాటిల్ శుభ్రం చేయడానికి మీరు బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. ఒక కప్పు నీటిలో 1-2 టీస్పూన్ల బేకింగ్ సోడా జోడించండి. దానిని బాటిల్‌లో పోసి బాగా చేక్ చేయండి. ఆ తర్వాత బాటిల్‌ను మూసివేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి, తర్వాత చిన్న బ్రష్‌తో శుభ్రం చేసుకోండి. ఈ పద్ధతి బ్యాక్టీరియాతో పాటు మరకలు, దుర్వాసన కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది బాటిల్‌ను కొత్తదానిలా మెరిసేలా చేస్తుంది.

వెనిగర్: సీసా వాసనలను వెనిగర్ తో సులభంగా తొలగించవచ్చు. దీని కోసం, ఒక కప్పు తెల్ల వెనిగర్ తీసుకొని బాటిల్ లో పోయాలి. అరగంట పాటు అలాగే ఉంచి, తర్వాత బాటిల్ ని బాగా కడగాలి. వెనిగర్ బాటిల్ ని శుభ్రం చేయడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా చంపుతుంది.

నిమ్మరసం: దీనికోసం, ఒక నిమ్మకాయ నుండి రసాన్ని పిండుకుని సీసాలో పోయాలి. సీసాలో కొద్దిగా నీరు వేసి బాగా షేక్ చేయాలి. నిమ్మకాయలోని ఆమ్లం బ్యాక్టీరియాను చంపి సీసా తాజాదనాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. 10-15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోండి.

బేకింగ్ సోడా, వెనిగర్: దీనికోసం, బాటిల్ కు 1 టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ వెనిగర్ కలపండి. బాటిల్ ను మూసివేసి బాగా కదిలించండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఈ రెండు ద్రావణాలు కలిసి మురికి, దుర్వాసనను తొలగిస్తాయి.

బియ్యం, నీరు: నీటి సీసాలను బియ్యం నీటిని ఉపయోగించి కూడా శుభ్రం చేయవచ్చు. కొంచెం ముతక బియ్యాన్ని తీసుకొని బాటిల్‌లో కలపండి. కొద్దిగా నీరు వేసి బాటిల్‌ను బాగా కదిలించండి. అప్పుడు బాటిలోని బియ్యం దాని లోపలి గోడలను శుభ్రం చేస్తాయి. మురికిని తొలగిస్తాయి. తరువాత, దానిని బాగా శుభ్రం చేయండి.