జామపండ్లు కొనేముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి.. లేకపోతే ఏం జరుగుతుందంటే..?

Updated on: Dec 22, 2025 | 5:59 PM

Guava: మార్కెట్లో జామపండ్లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ ఇంటికి తెచ్చి కోశాక చూస్తే లోపల పురుగులు లేదా కుళ్లిపోయి ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. మరి మంచి రుచికరమైన, నాణ్యమైన జామపండ్లను ఎలా గుర్తుపట్టాలో తెలుసా..? కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే మంచి జామకాయలను ఇట్టే గుర్తుపట్టొచ్చు.

1 / 6
రంగును బట్టి: మీరు జామకాయలను కొనేటప్పుడు రంగుపై దృష్టి పెట్టండి. మరీ ముదురు ఆకుపచ్చగా ఉంటే అవి అస్సలు పండలేదు అని అర్థం. అలా అని మరీ పసుపు రంగులో ఉంటే ఎక్కువగా పండిపోయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి లేత ఆకుపచ్చ, లేత పసుపు మధ్య ఉండే రంగును ఎంచుకోవడం ఉత్తమం.

2 / 6
తొక్క సాఫ్ట్‌గా: మంచి నాణ్యమైన జామ పండు తొక్క మృదువుగా ఉంటుంది. దానిపై నల్లటి మచ్చలు, ముడతలు లేదా గీతలు లేకుండా చూసుకోవాలి. తొక్క ఎక్కువగా దెబ్బతిన్నట్లు ఉంటే పండు లోపల ఇప్పటికే చెడిపోయి ఉండవచ్చు.

3 / 6
బరువు: పండు పరిమాణానికి తగ్గ బరువు ఉండాలి. జామపండు చేతికి కాస్త బరువుగా అనిపిస్తేనే అది నాణ్యమైనదని అర్థం. ఒకవేళ అది ఎండిపోయి లేదా తేలికగా ఉంటే, దానిలో రసం తక్కువగా ఉండి రుచి ఉండదు.

4 / 6
 పండును చేతితో మెల్లగా నొక్కి చూడండి. మరీ రాయిలా గట్టిగా ఉంటే అది పండలేదని, మరీ మెత్తగా ఉంటే అది కుళ్లిపోయే స్థితిలో ఉందని గుర్తించాలి. పండు కాస్త స్థిరంగా ఉంటూనే వేలితో నొక్కినప్పుడు కొంచెం వంగితే అది సరైన స్థితిలో ఉన్నట్లు లెక్క.

5 / 6
వాసన: పండిన జామపండు ఎప్పుడూ మంచి తీపి వాసన కలిగి ఉంటుంది. పండును వాసన చూసినప్పుడు వింతైన లేదా పుల్లటి వాసన వస్తుంటే ఆ పండు లోపల పాడైందని అర్థం. అటువంటి పండ్లకు దూరంగా ఉండండి.

6 / 6
జామపండు కోసిన తర్వాత లోపలి భాగం తెల్లగా లేదా లేత గులాబీ రంగులో ఉంటే అది తియ్యగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. వచ్చేసారి జామపండ్లు కొనేటప్పుడు ఈ రంగు, వాసన, బరువు, మృదుత్వం అనే 5 సూత్రాలను గుర్తుంచుకుంటే మంచి కాయలను ఇంటికి తీసుకెళ్లవచ్చు.