
మలబద్ధకం అంటే పేగుల్లోని మలం గట్టిగా, పొడిగా మారడం వల్ల బయటకు వెళ్లడం కష్టమవుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం, భారంగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాల మలబద్ధకం వల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి, అలసట, తలనొప్పి, దుర్వాసన, చర్మ సమస్యలకు దారితీస్తుంది. పురీషనాళంపై ఒత్తిడి వల్ల పైల్స్, ఆసన పగుళ్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

అసిడిటీ అంటే కడుపులో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం లేదా పైకి రావడం. ఇది గుండెల్లో మంట, పుల్లని త్రేనుపు, ఛాతీ నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. తరచుగా అసిడిటీ వల్ల కడుపు, గొంతు పొర దెబ్బతిని, అల్సర్లు, గ్యాస్ట్రిటిస్‌కు దారితీయవచ్చు.

నీరు తాగే సరైన పద్ధతి : నీటి లోపం వల్ల మలం గట్టిగా మారుతుంది. అందువల్ల రోజంతా తగినంత నీరు తాగడం తప్పనిసరి. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే ప్రేగులు క్లీన్‌గా మారి, మల విసర్జన సులభంగా జరుగుతుంది.

అసిడిటీకి: అసిడిటీ ఉన్నప్పుడు చల్లటి నీరు తాగడం వల్ల కడుపులో చికాకు తగ్గుతుంది. అయితే భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణ రసాలు పలుచన అవుతాయి. ఇది యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను పెంచుతుంది.

ఆయుర్వేదం ప్రకారం.. భోజనం తర్వాత వెంటనే ఎక్కువ నీరు తాగకుండా, రోజంతా చిన్న సిప్స్‌లో నీరు తాగడం ఉత్తమం. సాధారణంగా వేసవిలో 3-3.5 లీటర్లు, శీతాకాలంలో 2-2.5 లీటర్ల నీరు సరిపోతుంది. సమతుల్యంగా నీరు తీసుకోవడం ద్వారా మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అది రోగనిరోధక శక్తిని తగ్గించి, ఇతర తీవ్రమైన వ్యాధులకు దారితీయవచ్చు.