
మనం తాగే నీరును సడెన్ గా ఆపేస్తే అవయవ పనితీరు మొత్తం దెబ్బతింటుంది. అలాగే, శరీరంలోకి వ్యర్థాల తొలగింపుకు నీరు అవసరం. మనిషి నీరు తాగకుండా నాలుగు నుంచి ఆరు రోజులు మాత్రమే ఉండగలడని అధ్యయనాల్లో బయటపడ్డాయి.

శరీరంలో నీరు లేకపోతే రక్తంలో మార్పులు వస్తాయి. మూత్రపిండాలు కూడా వాటి పని తీరును మర్చిపోతాయి. దీని వలన మనిషి చాలా నీరసించి పోతాడని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆహారం లేకపోయినా మంచి నీళ్ళు తాగమని చెప్పేది.

ఇక మనిషి ఆహారం లేకుండా 2 నుంచి వారాల వరకు ఉండగలడు. ఇవి కొన్ని సందర్భాలలో ఇది 50 రోజుల వరకు కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, అలాంటి సమయంలో శరీరం నీరసం అవుతుంది.

శరీరంలో కొవ్వు నిల్వ ఉన్నవారు ఫుడ్ లేకుండా ఎక్కువ రోజులు ఉండగలరు. ఆ సమయంలో ఇదే వాళ్ళకి శక్తిగా పనిచేస్తుంది. అప్పుడు రోగనిరోధక వ్యవస్థ రోజు రోజుకు బలహీనపడుతుంది.

దీని వలన అవయవ పనితీరు కూడా బలహీన పడుతుంది. చివరికి మెదడు పని తీరు కూడా మందగిస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)