
ప్రస్తుతం గడ్డం పెంచడం అనేది ఫ్యాషన్‌గా మారింది. సెలబ్రిటీల నుంచి యువకుల దాకా గుబురుగా పెంచేస్తున్నారు. మంచి రఫ్ లుక్‌లో హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. అలాగే ఈ లుక్ మంచి క్రేజీగా ఉంటుంది. అమ్మాయిలు కూడా ఈ లుక్‌ని ఇష్ట పడుతున్నారు. అంతే కాకుండా ఈ లుక్‌లో అబ్బాయిలు చాలా అందంగా కనిపిస్తారు.

చూడటానికి అందంగా కనిపించిన ఈ గడ్డం నిజంగా పెంచడం కష్టమే. అందులోనూ ఈ సమ్మర్‌లో మరింత చిరాకుగా అనిపిస్తుంది. ఒత్తుగా గడ్డం ఉండటం వల్ల చాలా దురదగా, చికాకుగా ఉంటుంది.

అంతే కాదు చెమట కూడా బట్టి బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఒత్తైన గడ్డం ఉన్నవారు దురద వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఖచ్చితంగా టిప్స్‌ను ఫాలో చేసేయండి.

మీ గడ్డం నుంచి దురద రాకుండా ఉండాలంటే స్నానం చేసే ముందు గడ్డానికి ఆయిల్ పెట్టి మసాజ్ చేయండి. కనీసం వారంలో రెండు సార్లైనా ఇలా చేయడం మంచిది. అలాగే మీ స్కిన్ టైప్‌ని బట్టి మంచి క్లెన్సర్ వాడటం అవసరం.

మీరు స్నానం చేసేటప్పుడు మీ గడ్డాన్ని కూడా బాగా శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల బ్యాక్టీరియా వంటి ఉంటే పోతాయి. దీని కోసం మంచి కండీషనర్‌ని ఎంచుకోండి. ఆ తర్వాత మంచి లోషన్‌ని అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల దురద అనేది రాదు.