
మిరపకాయ బజ్జీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : కప్పు శనగ పిండి, మిరపకాయలు 8, తినే సోడా చిటికెడు, చింత పండు, రెండు టేబుల్ స్పూన్స్ వాము, ఉప్పు, నూనె, ధనియాల పొడి, ఆనియన్ రెండు, జొన్న పిండి రెండు టీ స్పూన్స్.

తయారీ విధానం : ముందుగా చింత పండును ఉడికించి దాని నుంచి గుజ్జు తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని, అందులో శనగ పిండి, తినే సోదా, వాము, జొన్న పిండి, ఉప్పు, చింత పండు గుజ్జు వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. పిండి మిశ్రమం చాలా చిక్కగా కలిపి పెట్టుకోవాలి.

తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో మిర్చీలు తీసుకొని వాటిని మధ్యలోకి కట్ చేసి, అందులోని గింజలు తీసి వేయాలి. ఆ మధ్యలో ఉప్పు, ధనియాల పొడి కొంచె పెట్టాలి. తర్వాత వీటిని బజ్జీల కోసం తయారు చేసుకున్న పిండిలో వేయాలి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టాలి. అందులో బజ్జీలు వేయించడానికి సరిపడ నూనె వేసి, మిర్చీలను శనగ పిండి మిశ్రమంలో నుంచి తీస్తూ నూనెలో వేసి వేయించుకోవాలి. అవి బంగారు రంగులో వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి.

తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. అంతే వేడి వేడి మిర్చీ బజ్జీలు రెడీ. ఇక వీటిపై ధనియాల పొడి చల్లుకొని, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకొని తింటే, టేస్ట్ అదిరిపోతుంది. మరి మీరు కూడా ట్రై చేయండి.