AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Homemade Ice Cream: క్రీమ్, మిల్క్ పౌడర్ లేకుండా ఇంట్లోనే క్రీమీ ఐస్ క్రీం.. చల్ల చల్లగా..కూల్ కూల్

ఎండల తీవ్రత పెరిగినప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చల్లని ఐస్ క్రీం కోరుకుంటారు. అయితే మార్కెట్లో లభించే ఐస్ క్రీముల్లో అధిక మోతాదులో ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు, ఎసెన్స్‌లు ఉంటాయి. ఇంట్లోనే ఎటువంటి విప్పింగ్ క్రీమ్, మిల్క్ పౌడర్, ఎలక్ట్రిక్ బీటర్ లేకుండా కేవలం పాలు, కాస్త జీడిపప్పు మరియు పంచదారకు బదులుగా ఆరోగ్యకరమైన బెల్లం ఉపయోగించి అత్యంత రుచికరమైన, క్రీమీ కుల్ఫీ ఐస్ క్రీం తయారు చేసుకోవచ్చు. సహజమైన పద్ధతిలో నోట్లో వేస్తే కరిగిపోయేలా సాఫ్ట్ ఐస్ క్రీం ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Phani CH
|

Updated on: Sep 02, 2026 | 7:25 PM

Share
కావలసిన పదార్థాలు: అర లీటర్ - మీగడ తీయని ఫుల్ ఫ్యాట్ పాలు, 12 నుండి 15 జీడిపప్పు పలుకులు, రుచికి తగినంత బెల్లం తురుము, అర టీస్పూన్ యాలకుల పొడి, కొద్దిగా కుంకుమపువ్వు, గార్నిషింగ్ కోసం సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకులు.

1 / 5
ఒక గిన్నెలో అర లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అంచుల వెంట వచ్చే మీగడను పాలల్లోకి కలుపుతూ పాలు సగానికి పైగా చిక్కబడే వరకు మరిగించాలి. మరొకవైపు, 12-15 జీడిపప్పు పలుకులను వేడి నీళ్లలో అరగంట పాటు నానబెట్టి, మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

2 / 5
పాలు సగం అయ్యేంత వరకు మరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి, సిద్ధం చేసుకున్న జీడిపప్పు పేస్ట్‌ను వేసి ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపాలి. అందులోనే మంచి రంగు మరియు ఫ్లేవర్ కోసం నానబెట్టిన కుంకుమపువ్వు పాలు కలపాలి. పాలు 35-40% పరిమాణానికి చిక్కబడే వరకు మరో 3-4 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

3 / 5
పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో 3 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము, అర టీస్పూన్ యాలకుల పొడి మరియు చల్లారిన పాల మిశ్రమాన్ని వేసి హై స్పీడ్‌లో నురగ వచ్చేలా మెత్తగా బ్లెండ్ చేయాలి. ఇలా మిక్సీ పట్టడం వల్ల క్రీమ్ లేకుండానే ఐస్ క్రీం అద్భుతమైన క్రీమీ టెక్స్చర్‌ను పొందుతుంది.

4 / 5
ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్‌లో లేదా కుల్ఫీ మోల్డ్స్‌లో పోసి, పైన తరిగిన డ్రైఫ్రూట్స్ చల్లాలి. ఐస్ క్రిస్టల్స్ ఏర్పడకుండా పైన అల్యూమినియం ఫాయిల్ లేదా ప్లాస్టిక్ కవర్‌తో కప్పి మూత గట్టిగా పెట్టాలి. దీనిని డీప్ ఫ్రిజ్‌లో 8 నుండి 10 గంటల పాటు ఉంచాలి. అంతే, 10 గంటల తర్వాత బయటకు తీసి ముక్కలుగా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, సహజసిద్ధమైన మిల్క్ ఐస్ క్రీం సిద్ధం!

5 / 5
Follow Us