మైగ్రేన్ తలనొప్పి కొందరినీ తీవ్రంగా కుంగ తీస్తుంది. కానీ మైగ్రేన్లు ప్రారంభమైనప్పుడు తలకు ఒకవైపున తీవ్రమైన నొప్పి మొదలైంది. దీనితోపాటు వికారంగా అనిపిస్తుంది. కాంతి, ధ్వనిని ఏమాత్రం తట్టుకోలేని సున్నితత్వానికి లోనవుతారు. మైగ్రేన్ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు. కానీ తలనొప్పి తీవ్రత దాదాపు ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉంటుంది.
నిజానికి చలికాలంలో నీళ్లు తీసుకోవడం తగ్గడం వల్ల.. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు మైగ్రేన్ నొప్పి పెరుగుతుంది. మైగ్రేన్ లక్షణాలను ఎలా నిరోధించాలో నిపుణుల మాటల్లో మీ కోసం.. మైగ్రేన్ లక్షణాలను తగ్గించడానికి తగినన్ని నీళ్లు త్రాగాలి. నీళ్లతో పాటు సూప్‌లు, జ్యూస్‌లు తాగాలి. శరీరాన్ని ఏ విధంగానూ డీహైడ్రేట్ చేయకూడదు. లేదంటే మైగ్రేన్ సమస్య పెరుగుతుంది.
మైగ్రేన్ చికిత్సలో అల్లం ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. మైగ్రేన్ లక్షణాలను నివారించడంలో, నియంత్రించడంలో అల్లం సహాయపడుతుంది. అల్లంతో వేడి నీళ్లు లేదా టీ తయారు చేసుకుని తాగవచ్చు. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల మైగ్రేన్ సమస్య పెరుగుతుంది. ఈ సమయంలో తక్కువ కెఫిన్ తీసుకోవాలి. హెర్బల్ టీ తాగడం వల్ల మైగ్రేన్‌లను అదుపులో ఉంచుకోవచ్చు. మైగ్రేన్ లక్షణాలను తగ్గించడానికి హెర్బల్ టీని త్రాగవచ్చు. చమోమిలే ఆయిల్ మైగ్రేన్ లక్షణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొంచెం చమోమిలే ఆయిల్‌తో నుదుటిపై మసాజ్ చేయవచ్చు. లేదా వేడి నీళ్లలో చమోమిలే ఆయిల్ మిక్స్ చేసి ఆవిరి పట్టినా ఫలితం ఉంటుంది. అలాగే చమోమిలే టీ కూడా తాగవచ్చు.
పుదీన నూనె, చమోమిలే నూనెలు మైగ్రేన్‌లను నియంత్రించడంలో సహాయపడతాయి. తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి పిప్పరమెంటు (పుదీన) నూనెతో నుదుటిపై మసాజ్ చేసుకోవచ్చు. పుదీనా టీ తాగడం వల్ల కూడా మైగ్రేన్ లక్షణాలు తగ్గుతాయి.
మైగ్రేన్ నొప్పి ప్రారంభమైనప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. చీకటి, నిశ్శబ్ద గదిలో విశ్రాంతి తీసుకోవాలి. అలాగే మైగ్రేన్ సమస్యను నియంత్రించడానికి క్రమం తప్పకుండా యోగా చేయాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మైగ్రేన్లు తిరిగి రాకుండా చేస్తుంది.