1 / 6
పోషకాహార లోపానికి తోడు కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా అమ్మాయిల ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా నుదుటిపై కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి చూడడానికి చిన్నవిగానే కనిపించినా ముఖారవిందంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రతరమవుతుంది. ఈక్రమంలో నుదుటిపై మొటిమలను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఉపయోగించే కొన్ని రసాయనాల వల్ల కొన్ని దుష్ప్రభావాలు లేకపోలేదు. అందుకే వీటి నుంచి ఉపశమనం పొందడానికి సహజ పద్ధతులనే ఎంచుకోవాలంటారు సౌందర్య నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.