
నాలుగైదు టేబుల్ స్పూన్ల తేనె, కొద్దిగా పెరుగు, టీస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించారు. సుమారు 30 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

రెండు గుడ్డు సొనలకు రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, తేనె కలపండి. బాగా కలిపిన తర్వాత మీ జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తరువాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

బొప్పాయి పండు తగినంత తీసుకోని ముక్కలుగా కట్‌చేసి అరకప్పు పెరుగు వేసి కలపాలి. పేస్ట్ చిక్కగా అయిన తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. 40 నిమిషాలపాటు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

సాధారణంగా చాలా మంది కొబ్బరినూనె వాడుతుంటారు. అయితే.. జుట్టు చిట్లిపోతుంటే.. కొబ్బరినూనెతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొబ్బరి నూనెను మీ జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. సుమారు 2 గంటలపాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

షాంపూతో స్నానానికి ముందు హెయిర్ కండీషనర్ చేయాలి. దాదాపు 10 నిమిషాలపాటు మంచిగా షాంపూతో మసాజ్ చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అయితే.. కండీషనర్ జుట్టుకు మాత్రమే అప్లై చేయాలి.

మీ జట్టు బాగా చిట్లిపోతుంటే.. ఈ హోం రెమిడిస్ బాగా పనిచేస్తాయి.