
కాకినాడ రూరల్ మండలం కరప లో శ్రీశ్రీ శ్రీ వారాహి మాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. చిక్కాల బ్రదర్స్,సీనియర్ జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో భారతదేశంలో కాశీలో ఎలాగైతే వారాహి అమ్మవారు ఉన్నారో, అలాగే భారతదేశంలో రెండవ వారాహి మాత అమ్మవారి విగ్రహం చేయించి భారీ ఎత్తులో శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహం ప్రాణ ప్రతిష్ట చేశారు.

కరప చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా మహిళలతో వేదమంత్రాల నడుమ పసుపు కొమ్ముల తో,కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా చిక్కాల దొరబాబు ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం మా పూర్వజన్మ సుకృతం అంటూ మహిళలందరూ నా అక్క చెల్లెలు అంటూ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం ప్రతి ఒక్క మహిళలకు తన చేతుల మీదుగా చీరలు అందజేశారు. శ్రీ కాశీ వారాహి అమ్మవారినీ దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించి మమ్మలను ఆనందంపజేయాలని విజ్ఞప్తి చేశారు చిక్కాల దొరబాబు.

వచ్చిన ప్రతి మహిళకు పసుపు కుంకుమ చీర పంపిణీ చేశామని తెలిపారు.కాశీలో వారాహి అమ్మవారు విగ్రహాన్ని తయారు చేసిన కళాకారుడు చేతనే ఇక్కడ కూడా బాల రాముడి ప్రతిరూపంతో ఉన్న వారాహి అమ్మ వారిని తయారు చేయించామని తెలిపారు. వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చారు భక్తులు.