Madras High Court: గుడిలోకి వితంతు మహిళ ప్రవేశం అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు సీరియస్.. ఏం చెప్పిందంటే
ఆలయంలోకి వితంతు మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు ఫైర్ అయ్యింది. వితంతువులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం చట్టాల ద్వారా పారిపాలించబడుతున్న ఈ నాగరిక సమాజంలో జరగవని పేర్కొంది. ఓ వితంతు మహిళ వేసిన పిటీషన్‌పై ఇలా స్పందించింది. తమిళనాడులోకి ఈరోడ్ జిల్లాలో తంగంణి అనే వితంతు మహిళను పెరియాకారుపరాయణ్ ఆలయంలోకి వెళ్లకుండా కొందరు ఆపారు.