ప్యాన్ ఇండియా రేంజ్‌లో అంతగా పాపులర్ అయింది ఆ సాంగ్. పుష్పరాజ్‌కి ప్రీ రిలీజ్ టైమ్‌లో ఉన్నపళంగా ఊపు తెచ్చింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఊ అంటావా అని ఎవరంటారు?
నిన్నమొన్నటిదాకా ఎవరూ.. ఇంకెవరు? అంటూ ఊరించిన విషయం మీద ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది. గత రెండేళ్లుగా ఎంత మంది భామల పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరికి యూనిట్ అంతా కలిసి శ్రీ లీలను చూసి ఊ.. అన్నట్టు సమాచారం..
ఇక కొన్ని నెలల క్రితం విడుదలైన బన్నీ స్పెషల్ గ్లింప్స్ గురించి చెప్పక్కర్లేదు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో అటు ట్రైలర్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పకుండానే వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు.
పుష్ప2 ప్రమోషన్స్ కోసం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో అభిమానులను కలవనున్నారు బన్నీ. పాట్నా, కోల్‌కతా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై , హైదరాబాద్‌లోని ఏడు ప్రధాన నగరాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. పుష్ప2 ట్రైలర్ పై ఏ రేంజ్ హైప్ నెలకొంది.
ఈ టూర్ అనేది పాట్నాలో ట్రైలర్ లాంచ్ వేడుకతో ప్రారంభం కానుంది. అలాగే ఈ ప్రధాన నగరాల్లో ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ నిర్వహించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లతో ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.