ఇవేవో అల్లాటప్ప ఆకులు కాదండోయ్…మధుమేహానికి దివ్యౌషధం..! మరిన్ని లాభాలు తెలిస్తే మతిపోవాల్సిందే..!!

Updated on: Jul 19, 2025 | 10:14 PM

అంజీర్ పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడంత మేలు చేస్తుంది. ముఖ్యంగా మహిళలు వీటిని తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు. అంజీర్‌ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు కాకుండా, పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా నిండి ఉన్నాయి. అంజీర్‌ పండ్లు మాత్రమే కాదు..డ్రైఫ్రూట్‌గా కూడా అంతే లాభాలు కలిగిస్తుంది. అంజీర్‌ పండ్లు, డ్రైఫ్రూట్‌తో పాటుగా అంజీర్‌ ఆకులు కూడా లెక్కలెనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

1 / 5
సాధారణంగా అంజీర్ ఆకులు తీసుకోవడం సురక్షితమే అయినప్పటికీ, డయాబెటిస్‌కు ఇప్పటికే మందులు లేదా ఇన్సులిన్ తీసుకుంటున్న వారు, అంజీర్‌ టీ తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఈ ఆకు టీ ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ, ఇది అందరిపై ఒకే విధమైన ప్రభావాలను చూపదు. కాబట్టి, ముందుగా వైద్యుడిని సంప్రదించి అతని సలహా మేరకు తీసుకోవడం మంచిది.

2 / 5
డయాబెటిస్ నిరోధక లక్షణాలతో పాటు, అంజూర ఆకులు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అవి సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తాయి. మూత్ర నాళం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అవి అల్సర్ల లక్షణాలను తగ్గించడంలో, రక్తంలో ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అంతేకాకుండా, అంజూర ఆకుల రసం దాని ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌ల కారణంగా మొటిమలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

3 / 5
అంజీర్ ఆకుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు మంచి పరిమాణంలో ఉంటాయి. అందువల్ల అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంజీర్‌ ఆకుల్లోని  ఔషధ గుణాలు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

4 / 5
ఇవి మొటిమలు, మచ్చలు, చర్మపు చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇవి దంతక్షయం, చిగుళ్ల సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. అంజీర్ ఆకుల రసం జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

5 / 5
అంజీర్ ఆకులను టీగా ఉపయోగించవచ్చు. ఈ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంజీర్ ఆకులతో టీ తయారు చేయడానికి ముందుగా అంజీర్‌ ఆకులను తీసుకుని శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి. వాటిని కావాల్సినన్నీ నీళ్లు తీసుకుని 10-15 నిమిషాలు మరిగించాలి. తర్వాత కాస్త గోరువెచ్చగా చల్లర్చుకుని ఫిల్టర్ చేసుకోవాలి. అందులో రుచికి సరిపడా తేనె కలిపి తీసుకుంటే సరిపోతుంది.