uppula Raju |
May 23, 2022 | 8:10 PM
పండ్లు చాలా రుచికరమైనవి ఆరోగ్యకరమైనవి. అయితే బరువు తగ్గాలనుకుంటే కొన్ని పండ్లకి దూరంగా ఉండాలి. ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం.
మామిడి - వేసవిలో మామిడిని ఎక్కువగా తీసుకుంటారు. బరువు తగ్గాలనుకుంటే మాత్రం మామిడిని ఎక్కువగా తినకండి. ఇందులో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించే ఆహారానికి ఆటంకం కలిగిస్తాయి.
పైనాపిల్ - పైనాపిల్ చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పండు. కానీ బరువు తగ్గే సమయంలో ఈ పండును ఎక్కువగా తినకూడదు. ఇది చాలా మధురంగా ఉంటుంది. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా బరువు తగ్గడం కష్టమైన పని.
అవకాడో - అవకాడో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో అధిక కేలరీలు ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. పరిమిత పరిమాణంలో తీసుకుంటే పర్వాలేదు. ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడానికి ఆటంకం కలిగిస్తుంది.
అరటిపండు- అరటిపండు చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పండు. ఇది చాలా కేలరీలు, సహజ చక్కెరను కలిగి ఉంటుంది. అరటిపండును ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి దీన్ని ఎక్కువగా తీసుకోవద్దు.