గోరువెచ్చని నీరు - మలబద్ధకం చికిత్సకు సులభమైన మార్గం గోరు వెచ్చని నీరు తాగడం. వీలైనప్పుడల్లా గోరువెచ్చని నీటిని తాగితే.. మలబద్ధకం సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం పరగడుపున కనీసం 2 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. దీంతోపాటు రోజంతా 2-4 లీటర్ల నీరు తాగాలి.
ప్రోబయోటిక్స్ - ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పటిష్టం చేస్తుంది. ప్రోబయోటిక్స్ ఆహారం మలబద్ధకం చికిత్సలో ప్రభావవంతంగా మారుతాయి. సౌర్‌క్రాట్, పెరుగు, కేఫీన్ వంటి ఆహారాలు సహజమైన ప్రోబయోటిక్స్ లభించే మూలికలు. తరచుగా పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
పైనాపిల్ జ్యూస్ - పైనాపిల్ జ్యూస్ రుచికరమైనది మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ మలబద్ధకం, ఉబ్బరం, పొత్తికడుపు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది.
సోపు గింజలు - సోపు గింజలు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను పెంచుతాయి. మీ కడుపు ఆరోగ్యాన్ని ఉంచేందుకు రోజూ అర టీస్పూన్ సోపు పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో తీసుకుంటే మేలు కలుగుతుంది. దీంతో అజీర్ణం, ఉబ్బరం వంటి ఉదరసమస్యలు తగ్గుముఖం పడతాయి.
పిప్పరమింట్ ఆయిల్ - పిప్పరమింట్ యాంటిస్పాస్మోడిక్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2-3 చుక్కల పిప్పరమెంటు ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మంచింది. దీంతోపాటు పుదీనా టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.