Telugu News » Photo gallery » Health tips people do these mistakes while drinking water in copper vessel or utensils in telugu
Health Tips: ఆరోగ్యంగా ఉండేందుకు రాగి పాత్రల్లో నీరు తాగుతున్నారా? అయితే, ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు..
Shiva Prajapati |
Updated on: Sep 13, 2022 | 6:27 AM
Health Tips: రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది వాస్తవమే. అయితే, అదే సమయంలో హానీ కూడా ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Sep 13, 2022 | 6:27 AM
Health Tips: రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది వాస్తవమే. అయితే, అదే సమయంలో హానీ కూడా ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తెలియకుండా చేసే కొన్ని తప్పుల కారణంగా ఈ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. మరి ఆ తప్పులు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
1 / 5
రాగి పాత్రలో నీటిని గంటల తరబడి ఉంచడం: రాగి పాత్రలో ఎక్కువసేపు నీటిని ఉంచకూడదు. ఆరోగ్య ప్రయోజనాల పేరుతో రాగి పాత్రలో నీటిని గంటల తరబడి ఉంచకూడదంటున్నారు. నీటిని ఉంచే వ్యవధి గరిష్టంగా 6 గంటలు మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు.
2 / 5
ఎక్కువ నీరు త్రాగడం: ప్రస్తుత రోజుల్లో ప్రజలు మార్కెట్ నుండి రాగి సీసాలు తీసుకొని అందులో నీరు త్రాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే, అదే సమయంలో రాగి పాత్రల్లోని నీరు ఎక్కువ మొత్తంలో తాగేస్తున్నారు. అలా తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. బాటిల్ వాటర్‌ను ఒకేసారి తాగేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. ఆయుర్వేదంలో కూడా నీటిని నెమ్మదిగా తాగాలని, నీటి పరిమాణం ఒకేసారి ఎక్కువగా ఉండకూడదని చెబుతున్నారు.
3 / 5
రాత్రిపూట నీరు త్రాగడం: పూర్వకాలంలో రాగి పాత్రల్లో నీటిని తాగేవారు. కానీ రాత్రిపూట ఉంచి ఉదయం సేవించేవారు. కానీ, ఇప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు రాగిపాత్రల్లో నీటిని నిత్యం వినియోగిస్తున్నారు. రాగి పాత్రల్లో నీరు రాత్రిపూట తాగడం వలన శరీరంలో ప్రతిచర్యను ప్రేరేపిస్తుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.
4 / 5
ఎసిడిటీ సమస్య: ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా రాగి పాత్రలో నీటిని తాగకూడదు. ఇది ఆరోగ్యానికి మరింత హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల వికారం, వాంతులు, కడుపులో ఉబ్బరంగా ఉంటుంది.