

బాదంలో ప్రొటీన్లు, విటమిన్ ఇ, ఫైబర్, బయోటిన్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్ వంటి మొదలైన పోషకాలు ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బాదంను పోషకాల భాండాగారం అని పిలుస్తారు.

బాదంపప్పులో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని ఆరోగ్యకరమైన కొవ్వులు అంటారు. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని పదికాలాలపాటు పదిలంగా కాపాడుకోవచ్చు.

బాదంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలతో పోలిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బాదం సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు బాదంపప్పును స్నాక్స్‌గా తినవచ్చు. వీటిని తింటే షుగర్ స్థాయిలు అదుపులోనే ఉంటాయి.

బాదంపప్పులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. జుట్టుని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.