Health Tip: మధుమేహం, గుండె జబ్బులను అదుపులో ఉంచే ఈ పండు గురించి మీకు తెలుసా?
Health Tips: ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ల్యూటిన్, జియాక్సంతిన్, ఫైటోకెమికల్స్ లాగా ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రయోజనం పొందుతారు. ప్రతిరోజూ కివీని తినడం వల్ల అనేక ప్రయోజనాలన..
Updated on: Aug 16, 2025 | 5:50 PM

Kiwi Fruit Benefits: బిజీ లైఫ్‌లో డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిగా మారింది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిని వెంటాడుతోంది. మధుమేహం వచ్చిందంటే చాలు జీవనశైలి మార్చుకోవాల్సిందే. లేకపోతే శరీరంలోని ఒక్కో అవయాశాన్ని నాశనం చేస్తుంది. ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవాలి. మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కివి పండు మధుమేమం ఉన్నవారికి అద్భుతమైన ప్రయోజనం కలిగిస్తుంది.

కివీ తొక్కపై ఉండే చిన్న వెంట్రుకల లాంటి సూక్ష్మమైన నారలు కూడా కొందరికి చర్మంపై దద్దుర్లు వచ్చేలా చేస్తాయి. కివీ పండుతో అలర్జీ ఉన్నవారు తొక్కను తాకినా, తిన్నా చర్మంపై చికాకు లేదా ఎరుపు రంగు దద్దుర్లు కనిపించవచ్చు.

అలాగే, రక్తాన్ని పలుచబడే మందులు తీసుకునే వారు కూడా కివీ పండు తినే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. కివీలో రక్తం గడ్డకట్టకుండా చేసే గుణం ఉంటుంది, కాబట్టి మందులతో కలిపి తింటే సమస్యలు తీవ్రమవుతాయి.

Kiwi fruit

మధుమేహాన్ని నియంత్రిస్తుంది:మధుమేహ రోగులకు కివి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఈ పండు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించబడుతుంది. కివి తినడం ద్వారా, సెరోటోనిన్‌ను పెంచే రసాయనాలు సక్రియం చేయబడతాయి. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది. డయాబెటిక్ పేషెంట్ ప్రతిరోజూ కివీని తినాలి.

కివి ఆరోగ్యానికి నిధి లాంటిది: కివి ఆరోగ్య నిధిగా పరిగణించబడుతుంది. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ల్యూటిన్, జియాక్సంతిన్, ఫైటోకెమికల్స్ లాగా ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రయోజనం పొందుతారు. ప్రతిరోజూ కివీని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇది కంటికి చాలా ముఖ్యమైన పండుగా కూడా పరిగణించబడుతుంది. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉండే ఈ పండులో ప్రతి రోజు తీసుకుంటే మీ ఆరోగ్యానికి కొదవ ఉండదు.




