
మనలో కొందరు నాన్ వెజ్ ఎక్కువగా తింటే ఇంకొందరు స్వీట్స్ తింటారు. నిజం చెప్పాలంటే, ఫుడ్ కంటే స్వీట్స్ నే అతిగా తింటారు. ఎందుకంటే, ఎవరు పనుల్లో వారు బిజీగా ఉంటున్న సమయంలో అన్నం వండి తినడానికి కూడా టైం లేదు.

అయితే, పరిశోధకులు మనిషిలో స్వీట్ తినాలనే కోరిక ఎందుకు పుడుతుందా అనే దాని మీద పరిశోధనలు చేయగా వాళ్ళు నమ్మలేని నిజాలను బయట పెట్టారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అలసటగా ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు చాలామంది స్వీట్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. అయితే ఎక్కువగా తింటే శరీరంపై దుష్ప్రభావాలు పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వైద్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం.. సమయానికి తినకపోవడం, బయట ఫుడ్స్ తినడం వల్ల స్వీట్స్ తినాలనిపించే కోరిక వస్తుందని వెల్లడించారు. అంతేకాదు, ఒత్తిడితో ఇబ్బంది పడేవారికీ కూడా స్వీట్లు తినాలనిపిస్తాదని చెప్పారు.

అయితే, ఇవి మరి ఎక్కువగా తిన్నా కూడా మీ ఆరోగ్యానికి ప్రమాదం. కాబట్టి, వాటికీ బదులుగా పండ్లు, డ్రై ఫ్రూట్స్ తింటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. మీరు మెల్లిగా ఇవి అలవాటు చేసుకోవడం మొదలు పెడితే స్వీట్స్ తినాలనే కోరిక కూడా తగ్గుతుంది.