Chayote Health Benefits: సీమ వంకాయలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..అస్సలు వదిలిపెట్టరు..

|

Dec 30, 2024 | 3:40 PM

సీమ వంకాయ.. ఇది మన మార్కెట్‌లో సాధారణంగా కనిపించే కూరగాయలలో ఒకటి. కానీ ఇప్పటికీ సీమ వంకాయ గురించి చాలామందికి తెలియదు. దీనిని కొన్ని ప్రాంతాల్లో చౌ-చౌ అని, తెలుగులో సీమ వంకాయ అని పిలుస్తారు. ఇది తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం కూరగాయగా మాత్రమే కాదు.. ఈ మొక్క వేరు, కాండం, గింజలు అలాగే ఆకులు కూడా తినదగినవే అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
సీమ వంకాయ తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఆహారం. అయితే, ఇటీవలి కాలంలో కొత్త రుచుల్లో ఈ కూరగాయ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ కూరగాయకు ప్రత్యేకమైన రుచి మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

2 / 5
సీమ వంకాయలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. త్వరగా కడుపు నిండిపోయేలా చేస్తుంది. ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా పొట్టను నిండుగా ఉంచుతుంది. సీమ వంకాయలో పోటాషియం అధికంగా ఉండటం వల్ల, ఇది రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. శరీరానికి కావలసిన శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

3 / 5
సీమ వంకాయలోని పోషకాలు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనిని ఆహారంలో చేర్చుకుంటే గుండె ఆరోగ్యం పెరుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇందులో విటమిన్ C, విటమిన్ K, ఫోలేట్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

4 / 5
సీమ వంకాయలో ఫ్లావనాయిడ్లు,ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించి, కేన్సర్ వంటి తీవ్రమైన రోగాల నుండి రక్షణ కల్పిస్తాయి.
ఈ కూరగాయలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి, అవి చర్మానికి కావలసిన పోషణను అందించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

సీమ వంకాయలో ఫ్లావనాయిడ్లు,ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించి, కేన్సర్ వంటి తీవ్రమైన రోగాల నుండి రక్షణ కల్పిస్తాయి. ఈ కూరగాయలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి, అవి చర్మానికి కావలసిన పోషణను అందించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

5 / 5
సీమ వంకాయలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ బాధితులకు అనుకూలమైన ఆహారం. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. దీనిలో ఉన్న విటమిన్ K, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. శరీరంలో కొన్ని క్యాన్సర్ కణాలు పురోగతిని అడ్డుకునే సమ్మేళనాలను సీమ వంకాయ కలిగి ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.