Sapota Fruit: క్యాన్సర్‌ని కూడా ఖతం చేసే శక్తివంతమైన పండు..! ప్రతిరోజు తింటే ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం..

|

Dec 09, 2024 | 8:23 AM

స‌పోటా పండు ఇష్టపడని వారంటూ ఉండరనే చెప్పాలి. భిన్నమైన తీపి రుచితో ఉండే ఈ పండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు నిండివున్నాయి. ముఖ్యంగా ఐరన్‌, కాపర్‌, పొటాషియం, ఫైబర్‌ ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సపోటా మన దేశం పండు కాదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది స్పెయిన్‌కు చెందినది. ఈ చెట్లు మధ్య అమెరికాలో పుష్కలంగా కనిపిస్తాయి. స్పెయిన్ నుండి నావికులు ఈ పండు విత్తనాలను భారతదేశానికి తీసుకువచ్చి ఇక్కడ పెంచడం ప్రారంభించారని సమాచారం. చలికాలంలో సపోటా లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

1 / 5
అధిక బరువు, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సపోటా బలేగా ఉపయోగపడుతుంది. సపోటా పండ్లు శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను అనేక విధాలుగా తగ్గించడంలో సహాయపడతాయి.

2 / 5
సపోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సపోటాలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి.

3 / 5
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా సపోటా తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. సపోటా పండ్లు నరాల ఒత్తిడి, బలహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండ్లను తింటే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది.

4 / 5
సపోటా పండు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. నిద్రలేమితో బాధపడేవారు ఈ పండు తింటే ప్రశాంతంగా నిద్రపోతారు. సపోటా పండును తీసుకోవడం వల్ల వృద్ధాప్య చర్మాన్ని కూడా దూరం చేస్తుంది.

5 / 5
రోజూ సపోటా తింటే ఎన్నో లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్లకు మంచిది. సపోటాలో సహజసిద్ధమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది. ఇది తగినంత శక్తిని అందిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు రోజూ సపోటా పండును తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.