Raw Coconut: పచ్చి కొబ్బరిలో ఎన్నో పోషకాలు.. తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? ఆదనంగా ఆ సమస్యలకు చెక్..!
Raw Coconut: చాలా మంది కొబ్బరి నీళ్లను తాగేందుకు ఇష్టపడతారు కానీ పచ్చి కొబ్బరిని పట్టించుకోరు. నిజానికి కొబ్బరి నీళ్లతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్నే ప్రయోజనాలు పచ్చి కొబ్బరితో కూడా ఉన్నాయి. ఎందుకంటే పచ్చికొబ్బరిలో కాపర్, సెలీనియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్, విటమిన్ సి, థయామిన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిగిన పచ్చి కొబ్బరితో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.. .