
బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకునేవారు జీడిపప్పు తింటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. జీడిపప్పు ఉన్న కారణంగా జీడిపప్పు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఆకలి కోరికను తగ్గిస్తుంది. ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యలు దూరం కావడమే కాక బరువు కూడా తగ్గుతారు.

బలమైన జుట్టు: జీడిపప్పు ద్వారా పుష్కలంగా లభించే జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు జుట్టును మృదువుగా, ఒత్తుగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంకా విటమిన్ ఇ, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కేశ సమస్యలను దూరం చేస్తాయి.

షుగర్ కంట్రోల్: ముందుగా చెప్పుకున్నట్లు జీడి పప్పులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాక రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను తగ్గించి, ఇన్సులిన్ సెన్సిటివిటీని క్రమబద్ధీకరిస్తుంది.

మెరిసే చర్మం: జీడిపప్పుకు ముఖంపై ముడతలు, మచ్చలు, మొటిమలను తగ్గించగల శక్తి కూడా ఉంది. ఇందులో విటమిన్ ఇ, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

రక్తహీనతకు చెక్: రక్తహీనతతో బాధపడేవారికి జీడిపప్పు మేలు చేస్తుంది. జీడిపప్పులోని ఐరన్ రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరిచి, రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.