
వంటకాలకు ప్రత్యేక రుచి, సువాసనను ఇచ్చే యాలకులు అనేక వంటలు, స్వీట్లలో ఉపయోగిస్తారు. యాలకులు ఆహారానికి ప్రత్యేక రుచిని ఇస్తాయి. అందుకే యాలకులు దాదాపు అన్ని వంగ గదుల్లో కనిపిస్తాయి.

కానీ భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చాలా మందికి తెలియదు. భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

