ఎన్నో ఔషధ గుణాలు దాగున్న సుగంధ ద్రవ్యాలను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. అలాంటి వాటిల్లో ఏలకులు ఒకటి.. ఏలకుల వాసన ఎంతో పరిమళంగా ఉంటుంది. ఏలకులు ప్రతి ఇంట్లో సులభంగా దొరుకుతాయి. ఏదైనా ఆహారం రుచి పెరగాలంటే ఏలకులను ఉపయోగిస్తారు. రుచి, సువాసన రెండింటినీ మెరుగుపరచడానికి ఏలకులు బాగా పనిచేస్తాయి. ఈ మసాలా దినుసు ప్రతీ వంటింట్లోనూ సులభంగా లభిస్తుంది.
ప్రతిరోజూ ఏలకులను నమలడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలా మంది దీనిని మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. మీరు దీన్ని రోజూ తింటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు..
ఏలకులను నమిలి తినవడం వల్ల నోటి దుర్వాసన పోవడమే కాకుండా ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పనిచేస్తుంది. దీంతో బరువు కూడా త్వరగా తగ్గుతారు. రోజూ ఏలకులు నమలడం వల్ల శరీరంలో కొవ్వు కూడా తగ్గుతుంది.
ఏలకులు నమలడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. దీన్ని తినడం వల్ల మీరు అన్ని వేళలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. దీంతో పాటు శరీరంలో పేరుకుపోయిన మురికి కూడా తొలగిపోతుంది. ఏలకులు బలహీనతను తొలగించడానికి కూడా బాగా పని చేస్తాయి.
మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే, ప్రతిరోజూ ఒక ఏలకులు తినండి. ఒక ఏలకులు నమలి తినడం వల్ల డయాబెటిస్ తోపాటు శరీరానికి సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఏలకులు శరీరంలోని వాపులను కూడా తగ్గిస్తాయి. ఇవి ఇంకా ఆరోగ్యగానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శరీరంలో అదనపు నీరు పేరుకుపోతే, అది టాయిలెట్ ద్వారా బయటకు పంపివేసేందుకు పనిచేస్తాయి.