సొరకాయలో విటమిన్-సి, సోడియం, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. సొరకాయ చాలా మందికి బోరింగ్ వెజిటేబుల్‌గా కనిపిస్తుంది. కానీ.. దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. షాకవుతారు. సొరకాయ చల్లదనానన్ని కలిగించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కావున మీరు ప్రతి సీజన్‌లో వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రస్తుతం వేసవి కాలంలో సొరకాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీంతోపాటు ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. మీరు సొరకాయను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అది కూడా చాలా మార్గాలలో సొరకాయను వండుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..