Ashwagandha: అశ్వగంధను ఇలా వాడితే..అకాల మరణం రాదు, ఆయుష్షు పెరగడం ఖాయం..!

|

Oct 11, 2024 | 4:37 PM

ఆయుర్వేదంలో అశ్వగంధకు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. అశ్వగంధను శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో శక్తివంతమైన మూలికగా వినియోగిస్తున్నారు. దీన్ని భారతీయజిన్సింగ్ అని కూడా పిలుస్తారు. అశ్వగంధ వినియోగంతో జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు మరెన్నో ప్రాణాంతక రోగాల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. ప్రతిరోజూ అశ్వగంధను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
అశ్వగంధ ప్రతి రోజూ తింటే ఎన్నో రకాల అనారోగ్యాలు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధకు అకాల మరణాన్ని దూరం చేసే శక్తి ఉందని చెబుతున్నారు. 
అశ్వగంధను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పలు అధ్యయనాలు చెప్పాయి.

అశ్వగంధ ప్రతి రోజూ తింటే ఎన్నో రకాల అనారోగ్యాలు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధకు అకాల మరణాన్ని దూరం చేసే శక్తి ఉందని చెబుతున్నారు. అశ్వగంధను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పలు అధ్యయనాలు చెప్పాయి.

2 / 5
Ashwagandha 4

Ashwagandha 4

3 / 5
అశ్వగంధ జ్ఞాపకశక్తిని, అభిజ్ఞా పనితీరును పెంచడంలో ముఖ్యమైనది. ఈ అశ్వగంధలో న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలు, ఆక్సీకరణ ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ వంటివి అధికంగా ఉంటాయి. నాడీ వ్యవస్థపై అశ్వగంధ మంచి ప్రభావాలను చూపిస్తుంది. మానసిక స్పష్టతను అందిస్తుంది.

4 / 5
అశ్వగంధ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అశ్వగంధ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఒత్తిడిని ఎదుర్కోవడంలో అశ్వగంధ ముందుంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించి రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

5 / 5
అశ్వగంధ లేహ్యం రూపంలో, పొడి రూపంలో, సప్లిమెంట్ల రూపంలో అందుబాటులో ఉంటుంది. రోజుకు రెండుసార్లు అశ్వగంధను తీసుకుంటే మంచిది. వెచ్చని పాలు లేదా గోరువెచ్చని నీళ్లలో పావు స్పూను అశ్వగంధ పొడిని కలుపుకొని తాగితే ఎంతో మంచిది. ఇక అశ్వగంధ సప్లిమెంట్లు వాడాలనుకున్నవారు ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.