
నువ్వుల్లో పోషకాలు దండిగా ఉంటాయి. నువ్వులలోని కాల్షియం ఎముకలు, దంతాలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. మోనోపాజ్ తర్వాత మహిళల్లో ఎదురయ్యే ఎముకల సమస్యలను నివారించడంలో ఇవి సహాయపడతాయి. నువ్వులు మహిళలకు ఎన్నో రకాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి.

మామూలు నువ్వులతో పోలిస్తే వేయించినవి తింటే మాంసకృత్తులు పుష్కలంగా అందుతాయట. ముఖ్యంగా కండరాల బలానికీ, హార్మోన్లు చురుగ్గా ఉండటానికీ ఇవి ఎంతో మేలు చేస్తాయి.

శీతాకాలంలో నువ్వులను మన ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతిరోజూ నువ్వుల లడ్డులు లేదా సాధారణ నువ్వుల చట్నీ కూడా తినవచ్చు. నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పెద్ద మొత్తంలో కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి కూడా మేలు చేస్తాయి. శీతాకాలంలో నువ్వుల పొడిని తయారు చేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

ఇది చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తాయి. నువ్వుల గింజల్లో విటమిన్ ఇ, జింక్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. నువ్వుల నూనె చర్మానికి పూయడం వల్ల పొడిబారడం తగ్గుతుంది.

నువ్వులు శక్తికి, జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి. నువ్వులు మంచి కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ కలిగి ఉంటాయి. అందువల్ల అవి శరీరానికి శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి నువ్వులు చాలా ఉపయోగపడతాయి.