
బరువు పెరుగుతారనే భయంతో చాలామంది అరటిపండ్లకు దూరంగా ఉంటారు. కానీ రోజువారీ ఆహారంలో ఒక పండిన అరటిపండు తినడం వల్ల రక్తపోటు నుంచి కొలెస్ట్రాల్ వరకు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.అరటిపండులో ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన ఎన్నో పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. అందువల్ల, అరటిపండ్లు మలబద్ధకం నుండి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

ఆకలితో పండిన అరటిపండు తింటే కడుపు నిండుతుంది. అయితే అరటి పండుతోపాటు ఈ 5 రకాల ఆహారాలు మాత్రం అస్సలు తినకూడదు. వీటితో కలిపి అరటిపండ్లు తినడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అరటిపండులో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, బి విటమిన్లు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి పోషక విలువలున్న ఈ పండును పాలతో కలిపి తింటే జీర్ణం కావడం కష్టమవుతుంది.

చాలా మంది ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. అంటే మాంసం, గుడ్లు.. ఈ రకమైన ఆహారాలతో అరటిపండుతో తినడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. ప్రోటీన్ స్థాయిలు పెరగడం వల్ల జీర్ణవ్యవస్థలో గ్యాస్ ఏర్పడుతుంది.

చక్కెర అధిక మొత్తంలో ఉండే ప్రాసెస్ చేయబడిన ఆహారాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అరటిపండ్లతో ఇటువంటి ఆహారాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతాయి. ఇది శారీరక అలసట, అసౌకర్యం, ఆకలిని పెంచుతుంది.

నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మంచివి. కానీ సిట్రస్ పండ్లలో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని అరటిపండ్లతో తినకూడదు. అరటిపండు, నిమ్మకాయల కలయిక కడుపు సమస్యలను పెంచుతుంది.