1 / 5
చాలా మంది చిన్న వయసులోనే జుట్టు రంగు తెల్లగా మరిపోతుంటుంది. దీంతో బయటికి వెళ్లలేక, నలుగురిలో కలవలేక నానాతిప్పలు పడుతుంటారు. మరీ ముఖ్యంగా కొందరికి పాతికేళ్లు రాకముందే నల్లటి జుట్టు కాస్తా తెల్లజుట్టుగా మారడం ప్రారంభమవుతుంది. తెల్లగా పండిపోయిన జుట్టును కప్పి ఉంచేందుకు చాలా మంది వ్యక్తులు హెయిర్ కలర్స్‌ను ఆశ్రయిస్తుంటారు. కానీ ఇది మీ జుట్టు ఆరోగ్యాన్ని అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక మరి కొంతమందికి 20 ఏళ్లు రాకముందే జుట్టు రాలిపోతుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే బట్టతల రావడం ప్రారంభమవుతుంది. అయితే అకాల తెల్ల జుట్టు, త్వరగా జుట్టు రాలడం వంటి సమస్యలు ప్రధానంగా పోషకాహార లోపం, అతిగా మద్యపానం, వ్యాయామం లేకపోవటం వంటి కారణాల వల్ల తలెత్తుతాయి.