
జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు ద్రాక్ష పండ్లను తింటే విరోచనాలు, కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, వారు మితంగా తీసుకుంటే చాలా మంచిది.

దగ్గు, జలుబు : జలుబు, దగ్గు సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే, ఇవి తియ్యగా ఉంటాయి. రాత్రిపూట తింటే కఫం ఎక్కువవుతుంది.

కిడ్నీలో రాళ్ళు : కిడ్నీలో రాళ్ళతో ఇబ్బంది పడేవారు వీటిని వారానికొకసారి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి, వీటిని తక్కువ తీసుకోవడం మంచిది.

ద్రాక్ష పండ్లు తిన్న తర్వాత కొందరికి చర్మ సమస్యలు వస్తాయి. ఇంకా ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలాంటి వాళ్ళు గ్రేప్స్ ను దూరం పెడితేనే మంచిది. లేదంటే అలర్జీలు పెరిగే అవకాశం ఉంది.

బరువు ఎక్కువగా ఉన్న వారు ద్రాక్ష పండ్లను తింటే ఇంకా ఎక్కువ పెరుగుతారు. వీళ్ళు ఫుడ్ డైట్ లో ద్రాక్ష పండ్లను నివారించాలి. చక్కెర ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉండండి.