ద్రాక్షతో ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు తగ్గాలంటే ఏ రకమైన ద్రాక్ష తినాలో తెలుసా..

|

Mar 31, 2024 | 8:57 AM

సీజనల్ పండ్లలో ద్రాక్ష కూడా ఒకటి. గుత్తులు గుత్తులుగా ఉండి అందంగా కనిపిస్తూ నోరూరించే ద్రాక్ష పండ్లను ఇష్టపడని వారు బహు అరుదు ఏమో.. ఆరోగ్యాన్ని ఇచ్చే ద్రాక్ష పండ్లు బరువు తగ్గడానికి కూడా బెస్ట్ ఆప్షన్. అయితే పచ్చని ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష తినడం మంచిది. ఎందుకంటే నల్లని ద్రాక్షలో రెస్వెరాట్రాల్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.  బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ద్రాక్షపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల  గురించి తెలుసుకుందాం.. 

1 / 10
ద్రాక్షలో చక్కెరలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది గర్భిణీలలో డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గర్భిణీలు ద్రాక్ష తినడం మానుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

2 / 10
ద్రాక్ష పండ్లు తీగలకు గుత్తులుగా వేలాడుతూ బరువుగా అందంగా కనిపిస్తాయి. ద్రాక్షలో పోషక విలువలు ఉన్నందున వీటిని క్రమం తప్పకుండా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

3 / 10
ద్రాక్షపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ అని పిలిచే ప్రమాదకరమైన రసాయనాల నుండి శరీరాన్ని రక్షించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

4 / 10
పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ ద్రాక్ష తినడం వల్ల బరువు పెరగకుండా నిరోధించవచ్చు. ద్రాక్షలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. బరువు తగ్గడానికి ఇదే ప్రధాన కారణం.

5 / 10
ద్రాక్షలో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇతర పండ్లతో పోలిస్తే ద్రాక్షలో కేలరీలు తక్కువగా ఉంటాయి. 

6 / 10

ద్రాక్షపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ద్రాక్షలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల  రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. అనారోగ్యానికి దూరంగా ఉండేందుకు, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ద్రాక్ష పండ్లు మంచి సహాయకారి 

7 / 10
ద్రాక్ష జీర్ణక్రియకు సహాయపడుతుంది. ద్రాక్షలో అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. దీంతో మలబద్దకాన్ని నివారించవచ్చు.

8 / 10
ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే పదార్ధం ఉంటుంది. నలుపు, ఎరుపు ద్రాక్షలో ఈ సమ్మేళనం అధిక మొత్తంలో ఉంటుంది. ఈ సమ్మేళనం అధిక స్థాయిలో ఉన్నట్లయితే, గర్భిణీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

9 / 10

ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులతో సహా దీర్ఘకాలిక వ్యాధులనుంచి ఉపశమనం ఇస్తుంది. 

10 / 10
అందుకే గర్భధారణ సమయంలో సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. ముఖ్యంగా గర్భిణీలు, ఆమె పిండానికి సమస్యలను కలిగించే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. అందువల్లనే గర్భధారణ సమయంలో మహిళలు కొన్ని రకాల ఆహారాలను తినకుండదని వైద్యులు చెబుతున్నారు. అలాగే కొన్ని పండ్లు కూడా పూర్తిగా నిషేధించాలి.