Gold price: తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?
బంగారం కొనుగోలు చేసే వారికి నేడు తీపికబరు అని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నేడు సోమవారం రోజున స్వల్పంగా తగ్గాయి. కాగా, నేడు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Updated on: Oct 06, 2025 | 6:27 AM

బంగారం ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నేడు గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు సోమవారం ( అక్టోబర్ 06)న కాస్త తగ్గుముఖం పట్టాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం.

బులియన్ మార్కెట్లో గురువారం (అక్టోబర్ 07) 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.1,19,390 గా ఉంది.(రూ.10 తగ్గింది), 22 క్యారెట్ల బంగారం తులం రూ.1,09,440 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం తులం రూ.89,540 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

అక్టోబర్ 05, 2025 ఆదివారం (నిన్న)24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,400గా ఉండగా,నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.1,19,390గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.1,09,450గా ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.1,09,440గా ఉంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,390ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,09,440 లుగా ఉంది. ఇక వెండి కొనుగోలు చేసే వారికి మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పాలి. నేడు సిల్వర్ ధర స్వల్పంగా తగ్గింది. మార్కెట్‌లో కేజీ వెండి రూ.1,64,900గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,19,390 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,09,440లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,64,900 లుగా ఉంది.వరంగల్ జిల్లాలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,19,390. 22 క్యారెట్ల ధర రూ.1,09,440లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,64,900లుగా ఉంది.



