Gold Price: బంగారం కొనే వారికి సూపర్ గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా తగ్గనున్న ధరలు.. తులంపై ఎంతంటే?

Updated on: Jun 14, 2026 | 8:17 AM

Gold price decline: బంగారం కొనాలనుకునే వారికి ఇదొక మంచి గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. వరుసగా గత కొన్నాళ్లు తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి మరింత నష్టాలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాబట్టి బంగారం ధరలు ఎంత మేర తగ్గనున్నాయో చూద్దాం పదండి.

1 / 5
రోజురోజుకూ డాలర్ పుంజుకోవడంతో మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కాస్త శాంతిస్తున్నాయి. అయితే ఈ ధరల తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, పెట్టుబడిదారుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెరిగే అవకాశం ఉందని తద్వారా డాలర్ మరింత బలపడి బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని విష్లేశకులు అంటున్నారు. ఇది పెట్టుబడి దారులకు షాకిచ్చినా.. కొనుగోలు దారులకు మాత్రం కాస్త ఊరనిస్తోంది.

2 / 5
మార్చి నుండి బంగారం ధర ఎంత తగ్గింది?: అయితే యుద్దం కారణంగా ఈ ఏడాది జనవరిలో బంగారం రికార్డు స్థాయిలో అవున్స్‌కు 5,595 యూఎస్ డాలర్లకు చేరుకుంది. దీంతో చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టారు. కానీ అప్పటి నుండి ఇప్పటివరకు ధర దాదాపు 25 శాతం వరకు పడిపోయింది. గరిష్ట ధరల వద్ద బంగారం కొనుగోలు చేసి, ధరలు పెరుగుతాయని ఆశించిన పెట్టుబడిదారులకు ఇది భారీ నష్టాన్ని మిగిల్చింది.

3 / 5
ఈ వారంలో మార్పు ఎలా ఉంది?: వారపు ట్రెండ్‌ను గమనిస్తే, బంగారం, వెండి ధరలు స్వల్ప లాభాలను నమోదు చేశాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం స్వల్పంగా పెరిగి అవున్స్‌కు 4,222 యూఎస్ డాలర్ల వద్ద ట్రేడవ్వగా భారతదేశంలో మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ధర 1.17శాతం పెరిగి, 10 గ్రాములకు రూ. 1,50,675 వద్ద ముగిసింది.

4 / 5
ధరలు మరింత తగ్గడానికి కారణాలు ఏమిటి?:స్టేట్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌కు చెందిన కమొడిటీ నిపుణుడు ఆకాష్ దోషి ప్రకారం, బంగారం ప్రస్తుతం రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. అందులో ఒకటి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంచే అవకాశం ఉందని.. మరొకటి  డాలర్ విలువ నిరంతరం పెరగడం బంగారం ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్నారు.ఈ రెండు అంశాలు ఈ విలువైన లోహంపై అదనపు ఒత్తిడిని కలిగించగలవుని ఆయన తెలిపారు.

5 / 5
బంగారం ధరలు ఎంతవరకు పడిపోవచ్చు?: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ UBS హెచ్చరికల ప్రకారం, మార్కెట్‌లో బలహీనత ఇలాగే కొనసాగితే స్వల్ప కాలంలోనే బంగారం ధరల్లో భారీ పతనం ఉండవచ్చుని తెలుస్తోంది. ఒకవేళ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే, బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో అవున్స్‌కు 3,850 నుండి 4,000 యూఎస్ డాలర్లకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లకు పడిపోతేనే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us