
గోల్డ్ ప్రియులకు బంగారం రేట్లు మసారి షాక్ ఇచ్చాయి. వెనిజులా సంక్షోభంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఇటీవలే హాల్‌టైం హైకి చేరుకున్న బంగారం ధరలు.. గత రెండ్రోజులుగా కాస్త తగ్గుతూ వచ్చాయి. కానీ ఆమెరికా వెనిజులాపై దాడి చేసి ఆదేశ పాలనను ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత ప్రపంచ వ్యక్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇవి బంగారం, వెండి, చమురు ధరలపై తీవ్ర ప్రాభావాన్ని చూపాయి. దీంతో ఇవాళ ఒక్కరోజూ బంగారంపై రూ.2000, వెండిపై రూ.6000 వరకు పెరిగాయి.

సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బంగారం, వెండి ధరలపై హెచ్చుతగ్గులను పరిశీలిస్తే.. ఉదయం 6 గంటలకు రూ. 1,35,810గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర.. 12 గంటల సమయానికి రూ. 1,37,400కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ఉదయం రూ.1,24,490లుగా ప్రస్తుతం 1,25,950గా కొనసాగుతుంది.

ఇక దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు చూసుకుంటే.. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర ప్రస్తుతం రూ.1,37,400గా కొనసాగుతుంటే.. చెన్నైలో తులం బంగారం రూ.1,38,330గా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం 1,37,550గా కొనసాగుతుంది.

బంగారమే కాదు అటు వెండి కూడా భారీగా పెరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు కేజీ వెండి ధర రూ. 6000 వేల వరకు పెరిగి ప్రస్తుతం కేజీ వెండి రూ.2,47,000 వద్ద కొనసాగుతుంది.

బంగారం ,వెండి పెరుగుదలకు కారణాలు: వెనిజులాపై అమెరికా దాడుల తర్వాత ముడి చమురు, బంగారం, వెండి ధరలు పెరగడం ప్రారంభమవుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ దాడి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచడంతో పాటు అక్కడ అనిశ్చితిని సృష్టిస్తున్నట్టు వారి తెలిపారు. దీంతో బంగారం, వెండి, రాగి వంటి విలువైన లోహాలతో ఆపటు ముడి చమురు వంటి వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.