పుష్పలాగా ఎవ్వరు అడ్డు వచ్చినా తగ్గేదేలే.. ఫుట్‌పాత్‌లన్నీ క్లియర్

Edited By:

Updated on: Apr 18, 2026 | 9:32 PM

GHMC అధికారులు హైకోర్టు ఆదేశాలతో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. పాదచారులకు, ట్రాఫిక్‌కు ఆటంకంగా మారిన ఆక్రమణలను తొలగించారు. బడంగ్‌పేట సర్కిల్‌లో అత్యధికంగా 333 దుకాణాలు సహా మొత్తం 653 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ నిరంతర డ్రైవ్‌తో ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గి, ప్రజల భద్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు.

1 / 5
HMC 6 జోన్ల పరిధిలో నేడు 653 ఫుట్‌ పాత్ ఆక్రమణలను కూల్చి వేసింది. శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్న 165 దుకాణాలు, తాత్కాలికంగా 488 దుకాణాలు తొలగించబడ్డాయి. బడంగ్ పేట సర్కిల్లో అత్యధికంగా 333 అక్రమ నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి.

2 / 5
ఈ డ్రైవ్ హైకోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతోంది. ఫుట్‌ పాతుల ఆక్రమణలు పాద చారులు, ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారాయి. GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలతో పోలీస్ బందోబస్తు మధ్య ఈ చర్యలు జరిగాయి.

3 / 5
ఫుట్‌ పాతులు ఆక్రమించడం వల్ల పాద చారులు రోడ్ల మీద నడవాల్సి వస్తుంది. ట్రాఫిక్ ప్రమాదాలు పెరుగుతున్నాయి. హైకోర్టు ఈ ఆక్రమణలు సహించ వద్దని, నిరంతర డ్రైవ్ చేయాలని ఆదేశించింది.

4 / 5
దుకాణదారులు షెడ్లు, కిరాణా షాపులు వేసి పబ్లిక్ స్పేస్‌ను ఆక్రమిస్తున్నారు.బడంగ్ పేటలో 333 ఆక్రమణలు తొలగించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ అక్రమ నిర్మాణాలు, అవినీతి ఫిర్యాదులు ఎక్కువ. GHMC ట్రాఫిక్ పోలీసుల సహకారంతో జేసీబీలు ఉపయోగించి కూల్చివేసింది. గత డ్రైవ్‌లు ట్రెండ్ కొనసాగుతోంది

5 / 5
2026 ఏప్రిల్ లో బేగంపేట, అమీర్ పేట్‌లో 798 దుకాణాలు తొలగించారు.2026 ఫిబ్రవరి లో రాజేంద్రనగర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చి వేశారు.2025 జూన్ లో మైలార్‌దేవ్‌పల్లి లో కమర్షియల్ కాంప్లెక్స్‌ల పై చర్యలు తీసుకున్నారు. GHMC ఈ డ్రైవ్‌ను నిరంతరం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆక్రమణలపై పౌరులు ఫిర్యాదులు చేస్తే త్వరగా చర్యలు తీసుకుంటామని GHMC తెలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us