Garlic Benefits: శీతాకాలంలో ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం మంచిదా?

|

Dec 13, 2024 | 5:28 PM

Garlic Benefits: ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఇక వెల్లుల్లితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు..

1 / 5
రోజూ వెల్లుల్లి రెబ్బను తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా గొప్పగా సహాయపడుతుంది.

2 / 5
వెల్లుల్లిలోని పోషకాలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం. వెల్లుల్లి తింటే.. లివర్‌, మూత్రాశయం పనితీరు మెరుగుపడుతుంది. వెల్లుల్లిలోని సమ్మేళనాలు కాలేయంలోని విషపదార్థాలను బయటకు పంపుతాయి.

3 / 5
రోజూ ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇందులోని అల్లిసిన్  శరీరంలోకి ప్రవేశించే వ్యాధికారక క్రిములతో పోరాడుతుంది. వెల్లుల్లి రక్తపోటు స్థాయిలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను తినండి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.

4 / 5
వెల్లుల్లిలోని అల్లిసిన్ రక్త ప్రసరణను పెంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం, యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
చలికాలంలో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల జలుబు, ఫ్లూ 63 శాతం తగ్గుతాయని ఓ నివేదిక వెల్లడించింది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అలాగే వెల్లుల్లిలో మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి.